: వరంగల్ లో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి రోజా
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సినీ నటి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా దిగుతున్నారు. ఇక్కడి పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు మద్దతుగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఆమె ప్రచారం చేస్తారు. ఇప్పటికే వరంగల్ లోని రఘునాథపల్లి వెళ్లిన రోజా నాలుగు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రచారం చేయనున్నట్టు వైసీపీ ప్రకటించింది.