: కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించి చూపిస్తాం: ఎంపీ కేశినేని నాని
విజయవాడలోని కనకదుర్గమ్మ వారి గుడి వద్ద ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైవే పక్కనున్న ఇళ్లను తొలగించే పనులను ప్రస్తుతం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు ఇవాళ ఫ్లైఓవర్ అలైన్ మెంట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించి చూపిస్తామని చెప్పారు. ఆరులైన్ల ఫ్లైఓవర్ కింద నాలుగులైన్ల రోడ్డును నిర్మిస్తామన్నారు. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుల చేతుల మీదుగా ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.