: కర్నూలుకు చంద్రబాబు వరాల జల్లు...ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఎడ్యుకేషన్ హబ్ ప్రకటన
రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గోరుకల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 900 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఉర్దూ వర్సిటీకి 125 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నెల నుంచి ఇమాంలకు నెలకు రూ.5 వేల వేతనం అందిస్తామని ఆయన ప్రకటించారు.