: 4 వేల కి.మీ లక్ష్యాన్ని తాకిన అగ్ని-4... పాక్ లో ఏ ప్రాంతాన్నైనా తాకే శక్తి భారత్ సొంతం!


పాకిస్థాన్ లోని ఏ ప్రాంతాన్నైనా, చైనాలోని 40 శాతం భూభాగాన్ని, కొన్ని అరబ్ దేశాలను, పశ్చిమాసియా దేశాలను చేరే శక్తి సామర్థ్యాలున్న అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీర ప్రాంతం నుంచి అణ్వస్త్రాలను తీసుకెళుతూ, 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే శక్తిగల ఈ క్షిపణిని ఒడిశా తీరం నుంచి ప్రయోగించిన అధికారులు, క్షిపణి లక్ష్యాన్ని తాకడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం ఐలాండ్ లోని ఐటీఆర్ (ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా దీన్ని ఈ ఉదయం 9:45 గంటలకు పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. 20 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువుండే దీని పరీక్షలను స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) నిర్వహించిందని పేర్కొన్నారు. అత్యాధునిక ఏవియానిక్స్ సాంకేతికత ఆధారంగా దీన్ని తయారు చేసినట్టు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. కాగా, దీన్ని సరిహద్దుల నుంచి ప్రయోగిస్తే, పాక్ లోని ఏ భాగాన్నైనా చేరవచ్చు. ముంబై తీరం నుంచి ప్రయోగిస్తే అరబ్ దేశాల్లోని లక్ష్యాలను, అండమాన్ నుంచి ప్రయోగిస్తే, పలు పశ్చిమాసియా ప్రాంతాలపైనా అణు బాంబులను వేయవచ్చు.

  • Loading...

More Telugu News