: యాపిల్ చరిత్రలో తొలిసారి... విడుదలైన నెల రోజులకే '6ఎస్' సిరీస్ ఫోన్లపై రూ. 34 వేల డిస్కౌంట్!


తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్లు 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లపై వినియోగదారులకు రూ. 34 వేల వరకూ డిస్కౌంట్ ను అందించే ఆఫర్ ను సంస్థ ప్రకటించింది. వీటిని కొనుగోలు చేసేవారికి బైబ్యాక్ సదుపాయాన్ని ఇస్తున్నట్టు తెలిపింది. యాపిల్ సంస్థ ఒక ఫోన్ ను విడుదల చేసిన నెల రోజుల వ్యవధిలో ఇటువంటి ఆఫర్ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఐఫోన్ 6 సిరీస్ అమ్మకాలు అంత జోరుగా లేకపోవడంతోనే ఈ తరహా ఆఫర్ ప్రకటించినట్టు నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్లు రూ. 62 వేల నుంచి రూ. 92 వేల రేంజ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఫోన్లతో పోలిస్తే వీటి అమ్మకాలు 20 శాతం తగ్గాయి. ఫోన్ ధరలు అధికంగా ఉండటం ఇందుకు కారణమని గమనించిన సంస్థ ఇప్పుడు బైబ్యాక్ ఆఫర్ ను ముందుకు తెచ్చింది. ఏ పాత యాపిల్ ఫోన్ ను వెనక్కిచ్చినా, ఆఫర్ ను పొందవచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News