: నీకా అర్హత లేదు: షారూఖ్ కు బర్కాదత్ బహిరంగ లేఖ
"నువ్వు షారూఖ్... హీరోవు, నీ సినీ పాత్రలతో ప్రజలకు ఎంతో దగ్గరయ్యావు. నా అభిమాన నటుడివి. నా కుమార్తెకు నువ్వంటే ప్రాణం. అయితే, నీకా అర్హత లేదని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఇది సిగ్గుచేటు" అని సీనియర్ జర్నలిస్ట్ బర్కాదత్ షారూఖ్ ఖాన్ ను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. దేశంలో జరుగుతున్న 'అసహనం' చర్చపైనా, అవార్డులను వెనక్కివ్వడంపైనా తన 50వ పుట్టిన రోజు సందర్భంగా షారూఖ్ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆయన పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని కూడా కొందరు రాజకీయ నేతలు విమర్శించారు. మరికొందరు షారూఖ్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. బర్కాదత్ స్వయంగా షారూఖ్ ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో 'అసహనం'కు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని బర్కాదత్ తన లేఖలో ప్రస్తావిస్తూ, షారూఖ్ అలా మాట్లాడివుండకూడదన్నది తన అభిప్రాయమని తెలిపారు. ఇండియాలో సెక్యులరిజం ఎంతగా ఒదిగిపోయిందోనన్న విషయానికి 'ఖాన్' పాప్యులారిటీ ఓ నిదర్శనమని ఆమె అన్నారు. "ఖాన్ షైనింగ్ ఈజ్ నాట్ ఇండియాస్ షైనింగ్" అంటూ కటువైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.