: ఈటీవీ నుంచి వస్తున్న సరికొత్త తెలుగు చానళ్లు!


తెలుగు లోగిళ్లలో వినోదాల జల్లులు కురిపిస్తున్న ఈటీవీ గ్రూప్ నుంచి మరో రెండు తెలుగు చానళ్లు వస్తున్నాయి. వీటిపై ఈటీవీతో పాటు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తా చానళ్లలో ఆ సంస్థ ప్రకటనలు గుప్పిస్తోంది. రోజుకు ఐదు సినిమాలను ఒకే ఒక్క బ్రేక్ తో ప్రదర్శించేలా 'ఈటీవీ సినిమా' పేరిట సరికొత్త చానల్ ప్రారంభం కానుంది. దీంతో పాటు మరిన్ని వినోదాత్మక కార్యక్రమాలను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు 'ఈటీవీ ప్లస్' పేరిట మరో చానల్ నూ ప్రారంభిస్తున్నట్టు ఈటీవీ వెల్లడించింది. ఈ రెండు చానళ్లూ నవంబర్ 14 నుంచి మొదలవుతాయని ఆ సంస్థ తన ప్రోమోల్లో చెబుతోంది.

  • Loading...

More Telugu News