: మారనున్న మోదీ టీం... శీతాకాల సమావేశాల తరువాత కొత్త మంత్రులు!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం బీజేపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు తప్పవని తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, అవి ముగిసిన వెంటనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీహారులో ప్రచారం చేసి ఫలితాలు రాబట్టడంలో విఫలమైన మంత్రుల్లో కొందరిని తొలగించవచ్చని, బీజేపీ చీఫ్ అమిత్ షాతో కలసి చర్చించిన అనంతరం మోదీ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులపైనా వేటు తప్పదని తెలుస్తోంది. వారు చేసిన వ్యాఖ్యలే ముస్లింలతో పాటు, పలు వర్గాల వారిని బీజేపీకి దూరం చేశాయని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. కనీసం ఐదుగురు మంత్రులకు పదవులు దూరం కానున్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.