: బర్త్ డే బాయ్ గా రేవంత్ రెడ్డి...కేక్ తినిపించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు


టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ యువ సంచలనం రేవంత్ రెడ్డికి నిన్నటితో 46 ఏళ్లు నిండాయి. 47వ ఏట అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. నిన్న హైదరాబాదులోని రేవంత్ రెడ్డి ఇంటిలో జరిగిన ఆయన బర్త్ డే వేడుకకు చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చేత కేక్ కట్ చేయించిన చంద్రబాబు బర్త్ డే బాయ్ కి కేక్ తినిపించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు హాజరైన ఈ కార్యక్రమం వేడుకలా జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఉపనేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ కొత్త కమిటీల ప్రకటనలో భాగంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత తొలి బర్త్ డే వేడుక జరుపుకున్న రేవంత్ రెడ్డి, వేడుకకు పార్టీ ముఖ్యులనందరినీ ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News