: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ... ఐదుగురు చిన్నారులకు గాయాలు
హైదరాబాదులోని కర్మన్ ఘాట్ లో కొద్దిసేపటి క్రితం ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన సదరు లారీ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు సహా ఆటో, బైక్ లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు సహా పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంపై స్థానికులు వేగంగా స్పందించారు. నిర్లక్ష్యంగా లారీని నడిపిన డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు పట్టించడమే కాక, గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.