: తిరుమలలో కుండపోత... విరిగిపడ్డ కొండచరియలు, ఇబ్బందుల్లో భక్తులు
తిరుమల వెంకన్న సన్నిధిలో మొన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం కారణంగా శ్రీవారి ఆలయం ముందున్న పరిసరాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా కొండపై చలి కూడా పెరిగిపోయింది. ఇక రెండో ఘాట్ రోడ్డులో 9వ కిలో మీటర్ రాయి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. సకాలంలో గుర్తించిన టీటీడీ సిబ్బంది వెనువెంటనే వాటిని తొలగించారు. నిన్న సాయంత్రానికే తిరుమలపై 5 సెంటీ మీటర్ల దాకా వర్షపాతం నమోదైంది.