: ‘గులాబీ’ నేతలకు షాకిస్తున్న ఓటర్లు...ఓరుగల్లులో అధికార పార్టీకి వరుస నిలదీతలు


మునుపటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమను కలసి ఓట్లు అడిగినా, అడగకపోయినా పోలింగ్ బూతుల్లో మాత్రం ‘కారు’ గుర్తుపై ఓటేశారు. ఏడాదిన్నర కూడా గడిచిందో, లేదో అప్పుడే ఆ పార్టీపై ఓటర్లు మండి పడుతున్నారు. అడుగడుగునా నిలదీస్తున్నారు. మొన్నటికి మొన్న ఏకంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరాడు. నిన్నటికి నిన్న మంత్రి హరీశ్ రావును మరో రైతు వేదిక మీదే నిలదీశాడు. తాజాగా నిన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యను ఓటర్లు అడ్డగించారు. ఉన్న పింఛన్లు కూడా తీసేస్తున్నారు, మీకెందుకు ఓటేస్తాం? అంటూ ముఖం మీదే నిరసన వ్యక్తం చేశారు. ఓటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారాన్ని అక్కడికక్కడే ఆపేసి వెళ్లిపోయిన దుస్థితి టీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. నిన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యలను వెంటబెట్టుకుని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరంగల్ లోక్ సభ్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రైతులు, వృద్ధులు, మహిళలు పలు అంశాలకు సంబంధించి వీరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వరుస ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేతలు తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News