: బీహార్ లో పార్టీల బలాబలాలు!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో చారిత్రాత్మక విజయాన్ని మహా కూటమి సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను కంగుతినిపించింది. బీహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆదివారం ఓట్ల లెక్కింపులో మహా కూటమి 178 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్డీఏకు 58 స్థానాలు మాత్రమే దక్కాయి. కొన్ని జిల్లాల్లో అయితే బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. ఎన్నికల ఫలితాల వివరాలు పార్టీల వారీగా చూస్తే... జేడీయూ- 71, ఆర్జేడీ-80, కాంగ్రెస్-27, బీజేపీ-53, ఎల్జేపీ -2, ఆర్ఎల్ఎస్పీ-2, హెచ్ఏఎం- 1 ఇతరులు-7.