: సొంత నియోజకవర్గంలో మాంఝీ పరాజయం
బీహార్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత మాంఝీ తన సొంత నియోజకవర్గమైన మఖ్దూంపూర్ లో పరాజయం పాలయ్యారు. ఆర్జేడీ అభ్యర్థి సుబేంద్రదాస్ చేతిలో ఓటమి చవి చూశారు. అయితే, మాంఝీ రెండు స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో మాత్రమే ఆయన విజయం సాధించారు. ఇమామ్ గంజ్ లో ఉదయ్ నారాయణ్ చౌదరిపై ఆయన గెలుపొందారు. కాగా, జేడీయూ నుంచి పక్కకు తప్పుకున్న మాంఝీ హిందూస్థాన్ ఆవామ్ మోర్చా పేరిట పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎన్నికల బరిలో దిగారు. ఈ పార్టీ నుంచి మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా మాంఝీ ఒక్కరే గెలుపొందడం విశేషం.