: కెమెరామెన్లు, పోలీసులపై సినీనటి జయప్రద ఆగ్రహం
కెమెరామెన్లు, పోలీసులపై ప్రముఖ సినీనటీ జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాదులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కూడా శనివారం రాత్రి ఈ తనిఖీలు జరిగాయి. మాదాపూర్ నుంచి ఫిలింనగర్ వైపు వెళుతున్న జయప్రద కారును ఆపి డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. మద్యం సేవించలేదని పరీక్షలో తేలింది. అయితే, అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు మరోమారు ఆ డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహిస్తే తాము ఫొటోలు తీసుకుంటామని పోలీసులకు చెప్పడంతో వారు అందుకు సిద్ధమయ్యారు. దీంతో జయప్రద కారు దిగి వారిపై మండిపడింది. ‘సెలబ్రిటీల ఫొటోలు పెద్దవిగా వేసి తమాషా చేసేందుకేనా రెండోసారి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష?.. అందుకు నా కారును ఆపాలా?’ అంటూ జయప్రద పోలీసులపై మండిపడ్డారు. దీంతో పోలీసులు సహా మీడియా కూడా అవాక్కయింది.