: మిఠాయిలు పంచిపెట్టిన లాలూ భార్య


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి బాణంలా దూసుకెళ్తుండటంతో ఆర్జేడీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. లాలూ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి తమ నివాసం వద్ద ఉన్న పార్టీ శ్రేణులకు ఆమె స్వీట్లు పంచిపెట్టారు. బీహార్ ఎన్నికలలో లాలూ కుమారులిద్దరూ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరిలో ఒకరు విజయం సాధించగా, మరో కుమారుడు అధిక్యంలో కొనసాగుతున్నాడు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు మంచి హుషారుగా ఉన్నారు. ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో ఆర్జేడీ మెరుగైన ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. కాగా, బీహార్ లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 169 స్థానాల్లో మహాకూటమి విజయం సాధించింది. 9 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. మహా కూటమి సాధించిన 169 స్థానాల్లో ఆర్జేడీవి 77 స్థానాలు ఉండటం విశేషం.

  • Loading...

More Telugu News