: మేమంతా ఒక్కటయ్యాం... బీజేపీ ఓడిపోయింది: లాలూ ప్రసాద్ యాదవ్


బీహార్ లో మహాకూటమి విజయభేరీ మోగించింది. ఈ సందర్భంగా జేడీ(యు) అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు మీడియాతో మాట్లాడారు. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, ‘మహాకూటమికి గొప్ప విజయాన్ని అందించిన బీహార్ ప్రజలు, దళితులకు ధన్యవాదాలు. బీహార్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూనే ఉంటాము. భారతీయ జనతా పార్టీ ఎంతో ముమ్మరంగా మాపై ప్రచారాలు చేసినప్పటికీ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. గత ఎన్నికల్లో మా మధ్య ఓట్లు చీలిపోవడంతో బీజేపీ గెలిచింది. ఈసారి అది కుదర్లేదు. మేమంతా ఒక్కటయ్యాం. బీజేపీ ఓడిపోయింది. నితీశ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్నికలకు ముందే చెప్పాం. అదే జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈ గెలుపు లాంతరు పట్టుకుని వారణాసి దాకా వెళ్తాం. పిడివాదులకు వ్యతిరేకంగా మా పోరాటం నిరంతరం సాగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News