: బీహారీలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు: డీఎంకే అధినేత కరుణానిధి


‘బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నితీశ్ కుమార్ కు, మహా కూటమికి అభినందనలు. బీహారీలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీ నాయకత్వంలో బీహార్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలి’ అంటూ డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఫ్యాక్స్ మెస్సేజ్ లో పేర్కొన్నారు. మహాకూటమి విజయం సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు అభినందనలు తెలుపుతూ ఆయన ఒక మెస్సేజ్ పంపారు. బీహార్ ను సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి పథంలో నడపడంతో పాటు సామాజిక న్యాయం విషయంలో ఆయన కట్టుబడి ఉన్నందునే ఈ విజయం వరించిందంటూ కరుణానిధి ప్రశంసించారు.

  • Loading...

More Telugu News