: మహాకూటమికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
బీహార్ లో సంపూర్ణ విజయం సాధించే దిశలో ఉన్న మహా కూటమికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకే నితీశ్ - లాలూ కూటమి ఘన విజయం సాధించిందని కేసీఆర్ ప్రశంసించారు. కాగా, మహా కూటమి 99 స్థానాల్లో విజయం సాధించి 76 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.