: బీహార్ లో ఓటమికి మోదీ బాధ్యత వహించాలి: చిదంబరం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడానికి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత చిదంబరం అన్నారు. నితీశ్ పై నమ్మకంతోనే బీహార్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారని అన్నారు. బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయపథంలో నడుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఆ పార్టీ బుట్టలో బీహారీలు పడలేదన్నారు. మహాకూటమి చారిత్రక విజయాన్ని సాధించిందని, ఈ సందర్భంగా నితీశ్-లాలూ కూటమికి అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.