: మాంఝీ విజయం ... మరో స్థానంలో వెనుకబడ్డ మాజీ సీఎం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమిలో కొత్త భాగస్వామి హెచ్ఏఎం అధినేత జితన్ రాం మాంఝీ విజయం సాధించారు. ఇమాంగంజ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జితన్ రాం 18,278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మాంఝీపై పోటీకి దిగిన జేడీయూ అభ్యర్థి ఉదయ్ నారాయణ చౌదరికి 10,198 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక బీఎస్పీ నుంచి పోటీ చేసిన మధురా పాశ్వాన్ కు కేవలం 576 ఓట్లే లభించాయి. ఇదిలా ఉంటే, మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్న మాంఝీ అక్కడ మాత్రం వెనకంజలో ఉన్నారు.