: నితీశ్ కు చంద్రబాబు అభినందనలు... కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా!


బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం నితీశ్ కు ఫోన్ చేసిన చంద్రబాబు ఎన్నికల్లో విజయం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నితీశ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. బీహార్ లో మహా కూటమి విజయం అభివృద్ధికి ప్రజలు కట్టబెట్టిన విజయమని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News