: నితీశ్ కు మోదీ ఫోన్... బీహార్ విజయంపై అభినందనలు తెలిపిన ప్రధాని


బీహార్ కు వరుసగా మూడో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న నితీశ్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. నేటి ఉదయం బీహార్ లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. మహా కూటమి పేరిట బరిలోకి దిగిన నితీశ్ కుమార్ విజయం దాదాపుగా ఖరారైంది. బీజేపీకి ఘోర పరాభవం తప్పేలా లేదు. బీజేపీకి వచ్చే సీట్లకు రెట్టింపు సంఖ్య కంటే అధిక స్థానాల్లో మహా కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కు మోదీ ఫోన్ చేశారు. మూడోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు నితీశ్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News