: మీడియా ముందుకు వచ్చిన లాలూ కుమార్తె...150కి పైగా స్థానాలను గెలుస్తామని ప్రకటన
బీహార్ లో మహా కూటమి ఘన విజయం నమోదు చేసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా కూటమిలోని కీలక పార్టీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. తన సోదరులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగగా, మీసా భారతి మాత్రం మహా కూటమికి దక్కనున్న విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం 150కి పైగా స్థానాల్లో మహా కూటమి విజయం సాధిస్తుందని మీసా భారతి ప్రకటించారు. మహా కూటమికి మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మీసా భారతి ముఖంలో విజయ దరహాసం కొట్టొచ్చినట్లు కనిపించింది.