: గెలుపు దిశగా మహా కూటమి... బీజేపీ కంటే రెట్టింపు స్థానాల్లో ఆధిక్యం


బీహార్ ఎన్నికల్లో కమలనాథుల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. నేటి ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో మొత్తం 243 స్థానాలకు గాను 159 స్థానాల్లో మహా కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కౌంటింగ్ ప్రారంభమైన తొలి దశలో ఆధిక్యం కనబరచిన బీజేపీ కూటమి, ఆ తర్వాత ఆ పార్టీ దూకుడు కాస్తంత నెమ్మదించింది. అదే సమయంలో తొలుత సింగిల్ డిజిట్ స్థానాల్లోనే ఆధిక్యం నమోదైన మహా కూటమి సమయం గడుస్తున్న కొద్దీ తన మెజారిటీ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం బీజేపీ కూటమి కేవలం 74 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో బీజేపీ కంటే మహా కూటమి ఆధిక్యం ఉన్న స్థానాలు రెట్టింపు సంఖ్య కంటే పెరిగిపోయాయి. వెరసి మహా కూటమి గెలుపు దిశగా పయనిస్తోందనే చెప్పొచ్చు. స్వతంత్ర అభ్యర్థులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News