: బీహార్ లోనూ సత్తా చాటుతున్న ఎంఐఎం... ఆధిక్యంలో మాంఝీ పుత్రరత్నం


హైదరాబాదు పాతబస్తీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) దేశవ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో పోటీ చేసిన తొలిసారే ఒవైసీ సోదరుల నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఏకంగా రెండు సీట్లను కైవసం చేసుకుంది. ఇక మహారాష్ట్రలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు. ఇక కులాల కుంపటిగా పేరుగాంచిన బీహార్ లోనూ ఎంఐఎం సత్తా చాటుతోంది. ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బైసీ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. అంతేకాక తన సమీప ప్రత్యర్థుల కంటే భారీ మెజారిటీ సాధించిన ఆ పార్టీ అభ్యర్థి విజయం దిశగా సాగుతున్నారు. మరోవైపు నిలబడ్డ రెండు స్థానాల్లో బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆయన పుత్రరత్నం సంతోష్ సుమన్ కూడా కుతుంబా నియోజకవర్గంలో విజయం దిశగా దూసుకెళుతున్నారు.

  • Loading...

More Telugu News