: క్రికెట్ అభిమానులు మున్నెన్నడూ చూడని విన్యాసాలివే...!


సాధారణంగా క్రికెట్ లో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మరో జట్టు సభ్యులు ప్రోత్సహించడం ఎక్కడైనా చూస్తామా?... తన బౌలింగ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ సిక్స్ కొడితే ఆనందంగా నవ్వడం ఏ బౌలర్ కైనా సాధ్యమా?...మంచి బంతి సంధించి అవుట్ చేస్తే...ఆ బౌలర్ ని అవుటైన బ్యాట్స్ మన్ అభినందించగలడా?....బౌన్సర్ సంధించిన బౌలర్ షాట్ కొట్టబోయి మిస్ అయిన బ్యాట్స్ మెన్ కు ఇప్పుడే వచ్చావు కదా? అప్పుడే భారీ షాట్ ఆడతావెందుకు, అంటూ సలహా ఇవ్వగలడా? మ్యాచ్ ముగిసిన తరువాత రెండు జట్ల ఆటగాళ్లు ఒకరి భుజంపై మరొకరు చెయ్యి వేసుకుని నడుస్తూ గ్రౌండ్ వీడడం ఎక్కడైనా చూడడం సాధ్యమవుతుందా?...మహామహులని పేరుతెచ్చుకున్న ఆటగాళ్లంతా స్వచ్ఛందంగా కోచ్ లు గా మారి ఒకేసారి బ్యాటింగ్, బౌలింగ్ పాఠాలు చెప్పడం ఎక్కడైనా జరిగిందా?...పై విశేషాలన్నీ...న్యూయార్క్ లోని సిటీ పార్క్ స్టేడియంలో చోటుచేసుకున్నాయి. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లంతా భేషజాలను పక్కనపెట్టి ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుంటూ, ఒకర్ని ఒకరు ఆటపట్టించుకుంటూ, తుళ్లుతూ, గెంతుతూ క్రికెట్ మజాను అభిమానులకు పంచారు.

  • Loading...

More Telugu News