: బీహార్ లో మొదలైన బీజేపీ సంబరాలు... పోటీ మాత్రం హోరాహోరీనే!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే బీజేపీ సంబరాలు మొదలయ్యాయి. తొలి రౌండ్ పూర్తైన మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించిన నేపథ్యంలో పాట్నాలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు తెర తీశారు. బాణా సంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ కమలనాధులు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు ఆయా స్థానాల్లో ఆధిక్యం వేగంగా మారుతోంది. తుది వార్తలు అందే సమయానికి 154 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 72 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక తొలుత కాస్తంత వెనుకబడ్డ మహా కూటమి అభ్యర్థులు కూడా 77 స్థానాల్లో ఆధిక్యం సాధించారు. దీంతో అందరూ ఊహించినట్లుగానే బీహార్ లో హోరాహోరీ పోరు నెలకొంది. విజయం రెండు కూటముల మధ్య దోబూచులాడుతోంది.

  • Loading...

More Telugu News