: బీహార్ లో విజయోత్సవాలు లేవు!... ర్యాలీలపై నిషేధం విధించిన ఈసీ


దేశవ్యాప్తంగా అమితాసక్తిని రేకెత్తించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం దిగ్విజయంగా పూర్తి చేసింది. కరుడుగట్టిన నేరస్తులకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బీహార్ లో చెదురుమదురు ఘటనలు మినహా ఒక్క మరణం కూడా లేకుండానే ఎన్నికలను ఈసీ అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించింది. ఇక తుది ఘట్టం ఓట్ల లెక్కింపును ఈసీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించింది. పోలింగ్ ను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన ఎన్నికల సంఘం, ఫలితాల తర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాకుండా చూసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ సంచలన నిర్ణయంతో బీహార్ లో ఎవరు గెలిచినా పెద్దగా సంబరాలు ఉండబోవు.

  • Loading...

More Telugu News