: కాసేపట్లో క్రికెట్ దిగ్గజాల ఆట షురూ!


1990ల నుంచి ప్రపంచ క్రికెట్ ను తమ ప్రదర్శనతో ఆకట్టుకుని తమదైన శైలితో చరిత్రలో నిలిచిన దిగ్గజాలను మరి కాసేపట్లో టీవీలలో వీక్షించవచ్చు. ఈ దిగ్గజాలు ఆడే ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీ కాసేపట్లో న్యూయార్క్ లో ప్రారంభం కానుంది. సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో తొలి టీట్వంటీ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఖ్యాతి గడించిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, బ్రియాన్ లారా, మహేళ జయవర్థనే, మాథ్యూహేడెన్, మైఖేల్ వాన్, రీకీ పాంటింగ్, జాంటీ రోడ్స్, జాక్వస్ కలిస్, కార్ల్ హూపర్, మెయిన్ ఖాన్, ఆండ్రూ సైమండ్స్, కుమార సంగక్కర, ముత్తయ్య మురళీధరన్, గ్రేమీ స్వాన్, కర్ట్ లీ ఆంబ్రోస్, షాన్ పొలాక్, గ్లెన్ మెక్ గ్రాత్, లాన్స్ క్లూసెనర్, షోయబ్ అఖ్తర్, షేన్ వార్న్, సక్లయిన్ ముస్తాక్, డేనియల్ వెటోరీ, కోట్నీ వాల్ష్, వసీం ఆక్రమ్, అలెన్ డొనాల్డ్, అజిత్ అగార్కర్ తదితరులను క్రికెట్ అభిమానులు మరోసారి కన్నుల పండుగగా వీక్షించవచ్చు.

  • Loading...

More Telugu News