: మోదీ కాశ్మీర్ పర్యటనలో అపశ్రుతి


కాశ్మీర్లో పీడీపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన కూడా జరిగింది. మోదీ ర్యాలీ సందర్భంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో భద్రతాదళాలు వారిని అడ్డుకున్నాయి. రాళ్లతో నిరసనకారులు దాడులకు పాల్పడడంతో పోలీసులు లాఠీలు, తుపాకులకు పని చెప్పారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో నిరసనకారుల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కాగా, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మోదీ నేటి సభలో 80 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News