: రోహిత్ శర్మ అజేయ శతకం
రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై తరపున రోహిత్ బ్యాటింగ్ కు దిగాడు. ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబైకి అదిత్య తారే (30), హర్ వద్కర్ (58) శుభారంభం ఇచ్చారు. అనంతరం దిగిన శ్రేయస్ అయ్యర్ (137), సూర్య కుమార్ యాదవ్ (58) రోహిత్ శర్మ (110) పరుగులతో యూపీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు 407 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఇంకా క్రీజ్ లో వున్నాడు.