: 'సో స్వీట్ మున్నీ' అంటున్న సల్మాన్ ఖాన్
ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఓ వీడియో చూసి మురిసిపోయాడు. అంతేకాదు, తన వాల్ పోస్ట్ పై ఆ వీడియో పోస్టు చేస్తూ 'సో స్వీట్ మున్నీ' అని పేర్కొన్నాడు. ఇంతకీ సల్మాన్ ను అంతలా ఆకట్టుకున్న మున్నీ ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు, బాలనటి హర్షాలీ మల్హోత్రా. ఇంతకీ హర్షాలీ మల్హోత్రా ఎవరంటే 'భజరంగా భాయ్ జాన్' సినిమాలో సల్మాన్ తో పోటాపోటీగా నటించిన బాలిక. సల్మాన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పే హర్షాలీ, అతని తాజా సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయే' సినిమాలో టైటిల్ సాంగ్ డబుమాష్ లో హర్షాలీ డాన్స్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో సల్మాన్ సంబరపడిపోయాడు. సో స్వీట్ మున్నీ అంటూ తన వాల్ పై ఆ వీడియో పోస్టు చేశాడు.