: నేను చాలా సంస్కారవంతుడ్ని...నా రెండో రూపాన్ని చూడాలనుకోవద్దు: అలీ హెచ్చరిక
తాను చాలా సంస్కారవంతుడినని సినీ నటుడు అలీ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తనలో రెండో రూపం చూడాలని అనుకోవద్దని అన్నారు. తాను ఓ మంచి కుమారుడు, మంచి భర్త, మంచి తండ్రిగా నిరూపించుకున్నానని, తనకు కూడా సభ్యత, సంస్కారం తెలుసని చెప్పారు. తాను సందర్భాన్ని అనుసరించి వ్యాఖ్యలు చేస్తానే తప్ప, అవతలి వారిని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ భావించనని అలీ స్పష్టం చేశారు. సమాజంపై తనకు కూడా బాధ్యత ఉందని, తాను కూడా పలు బాధ్యతలు తీసుకుంటానని అలీ అన్నారు. తానేంటో తనను దగ్గరగా చూసిన వారికి తెలుస్తుందని ఆయన చెప్పారు. తనపై వెబ్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనలోని రెండో రూపాన్ని చూడవద్దని అలీ చెప్పారు.