: మహేశ్ బాబులాంటి 'శ్రీమంతు'రాలామె!


సినీ నటులు పలువురు ఇటీవల పలు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అమలాపురం దగ్గర కామనగరువు గ్రామానికి చెందిన గడ్డి గనికమ్మతో పోల్చుకుంటే భారీ ఎత్తున పారితోషికాలు తీసుకునే సినీ నటులు గ్రామాలను దత్తత తీసుకోవడంలో పెద్ద ప్రత్యేకత ఏమీ కనిపించదు. గనికమ్మ భర్త గతంలోనే మృతిచెందారు. ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో ఆమె గ్రామంలో తనకు ఉన్న పొలంలో పండే పంట ఆధారంగా జీవిస్తోంది. తాజాగా ఆ ఊరి బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా స్కూలును తీసేస్తున్నారని తెలిసింది. దీంతో ఊరి పిల్లల చదువుకు ఆటంకమవుతుందని గుర్తించి, తన ఐదు సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఈ భూమి విలువ 20 లక్షలపైమాటే అంటే ఆశ్చర్యం కలుగకమానదు. అయితే తాను బతికుండగానే స్కూలు కట్టించి, ఆ స్కూలుకు తన పేరు పెట్టాలని ఆమె కోరారు. దీంతో గ్రామ సర్పంచ్, స్కూలు సిబ్బంది పిల్లల సమక్షంలో ఆమెను అభినందించారు.

  • Loading...

More Telugu News