: గచ్చిబౌలిలో స్కూలు బస్సు బీభత్సం...సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గాయాలు


హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఓ స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది. చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ ఆగి ఉండగా, వెనుకగా స్పీడుగా వచ్చిన స్కూలు బస్సు డ్రైవర్ ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఒక కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. వెనుక నుంచి నేరుగా ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్న ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, రెండు ఆటోల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్కూలు బస్సు డ్రైవర్ గంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News