: స్కూల్ లో టీచర్లను...ఇంట్లో తల్లిని... ఇప్పుడు సోషల్ మీడియాను నవ్వించిన బాబీ!
పిల్లలు అనాలోచితంగా చేసే పనులు అందర్నీ ఆనందంలో ముంచెత్తుంటాయి. అలాగే ఓ తుంటరి పిల్లాడు పరీక్షలో రాసిన సమాధానాలు ఆ స్కూలు టీచర్లను నవ్వుల్లో ముంచెత్తగా, ఇంట్లో తల్లికి ముందు కోపం తెప్పించినా, తరువాత తన కుమారుడి అతి తెలివికి నవ్వుతెప్పించాయి. ఆ జవాబుపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను నవ్విస్తోంది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో ఆరేళ్ల బాలుడికి ప్రశ్నాపత్రంలో 'బాబీ దగ్గర నాలుగు డైమ్ లు ఉన్నాయి. ఎమీ దగ్గర 30 పెన్నీలు ఉన్నాయి. అయితే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది?' అని అడుగగా దానికి సమాధానంగా బాబీ దగ్గర అని రాశాడు. (ఈ సమాధానం కరెక్టే...పెన్నీ ల కంటే డైమ్ విలువ ఎక్కువ). 'నువ్వు రాసిన సమాధానం కరెక్టు అని ఎలా చెప్పగలుగుతున్నావు?' అని అడిగారు. దీనికి బాబీ ఓ ముఖం బొమ్మ వేసి, దాని తల దగ్గర కార్టూన్ బొమ్మల్లోలా రెండు మేఘాలు వేసి 'బాబీ' అని ఆలోచిస్తున్న ఫోజులో బొమ్మ గీశాడు. అతని సమాధానానికి స్కూల్లో టీచర్లు, ఇంట్లో తల్లి, ఇప్పుడు సోషల్ మీడియా నెటిజన్లు నవ్వుకుంటున్నారు. పిల్లాడు గడుగ్గాయి అని ముచ్చటపడుతున్నారు.