: కేసీఆర్ పై ఈర్ష్యతోనే విమర్శిస్తున్నారు: మంత్రి జగదీష్ రెడ్డి


ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాదరణ పొందుతున్నాయని... వీటిని చూసే ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఏడాది కాలంలోనే కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. కేసీఆర్ పై ఈర్ష్యతోనే విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలోని కొడకండ్లలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News