: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.300 కోట్లు: ఈసీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.300 కోట్లు అయిందని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలన్నింటిలోనూ ఈ ఏడాది ఎన్నికలకే ఎక్కువ ఖర్చయిందని ఎన్నికల అధికారులు చెప్పారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భద్రతా ఏర్పాట్లను మరింత పెంచామన్నారు. తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీఏపీఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉపయోగించిన వాహనాలు, వాటి ఇంధనం, బారికేడ్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర వాటికి రూ.152 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. దాదాపు 3.27 లక్షల మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ బాధ్యతలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు.