: వరద బాధితులకు అందజేయమని మా అమ్మ 5000 రూపాయలు ఇచ్చింది: మోదీ


సెంటిమెంటును తాకేలా మాట్లాడుతూ భావోద్వేగాలను రేకెత్తించడంలో ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేక శైలి. తన జీవితం, కుటుంబంలో చోటుచేసుకున్న సంఘటనలను సందర్భోచితంగా ప్రస్తావించి అభిమానం చూరగొంటూ ఉంటారు. తాజాగా జమ్మూకాశ్మీర్ పర్యటనలో కూడా అలాంటి ప్రస్తావనే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తల్లి ప్రతి పుట్టిన రోజున తనకు 5 రూపాయలు, లేదా 11 రూపాయలు ఇచ్చేదని, తన జీవితంలో తొలి సారి 5000 రూపాయలు ఇచ్చి జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు అందజేయాలని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఈ దీపావళి వినూత్నంగా జరుపుకోవాలని భావించే జమ్మూకాశ్మీర్ కు వచ్చానని అన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో వినూత్న రంగాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తే విద్యుత్ ఆదా అవుతుందని, ఆ విద్యుత్ ను ఇతరులకు అందజేసిన వారవుతారని ఆయన చెప్పారు. అలాగే గతంలో చాలా గ్రామాలకు రోడ్లు అందుబాటులో ఉండేవి కాదని, ఇప్పుడు ప్రతి గ్రామానికి విద్యుత్, రోడ్డు సౌకర్యం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్ లో జమ్మూ నుంచి కాశ్మీర్ కు కేవలం రెండు గంటల్లో వెళ్లే విధంగా రోడ్లను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News