: రాజధానిని తప్ప చంద్రబాబు దేనినీ పట్టించుకోవడం లేదు: శైలజానాథ్
రాజధాని ప్రాంతంలోని తుళ్లూరుపైనే సీఎం చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెడుతున్నారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. మిగతా జిల్లాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్రలను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని బీజేపీ నీచ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ నెల 9న కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం ప్రారంభమవుతుందని, అన్ని గ్రామాల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపుతామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ వివరించారు.