: భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోతే భూసేకరణ తప్పదు: గుంటూరు జాయింట్ కలెక్టర్
ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం ఇప్పటికే భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని భూములపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ క్రమంలో భూములు ఇవ్వడానికి ముందుకు రాని రైతులతో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం వల్ల భవిష్యత్తులో రైతులకు కలిగే ఉపయోగాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. రైతులంతా చివరిసారిగా ఆలోచించుకొని సహకరించాలని కోరారు. ఒకవేళ భూములను ఇవ్వడానికి ముందుకు రాకపోతే భూసేకరణ తప్పదని స్పష్టం చేశారు.