: చిరు ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టారు... అందుకే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాలేదు: దేవినేని నెహ్రూ


సినీ నటుడు, పార్టీ నేత చిరంజీవి ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. అందుకే విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాలేదని చెప్పారు. చిరంజీవి మాస్ లీడర్ అని, ఆయన చరిష్మాను ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని నెహ్రూ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గాలేరు-నగరి ప్రాజెక్టులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మంత్రి దేవినేని ఉమ, ఎంపీ సీఎం రమేష్ లపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుడమేరు నీటిని కృష్ణా నదికి తరలించి పట్టిసీమ నీరుగా చెబుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ నుంచి కృష్ణా బ్యారేజీకి ఒక్క చుక్క నీరు కూడా రాలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల కమీషన్ దండుకున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News