: రాజకీయ అవసరాలకోసమే సీమ ఉద్యమం చేస్తున్నారు: జేపీ
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంకోసం ఇటీవల పలువురు రాజకీయ నేతలు చేస్తున్న ఉద్యమం, ధర్నాలను లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ తప్పుబట్టారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే సీమ ఉద్యమాన్ని రాజకీయ నేతలు చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ కోసం చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయడం లేదని ఆరోపించారు. ఇలాంటి సమయంలో మేధావులంతా కూర్చుని సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు. ఈ మేరకు అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేపీ, దోపిడీదారి ప్రభుత్వాలపై యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.