: తిరుమలలో డిప్యూటీ ఈవోకే లడ్డూ టోకెన్లు అమ్మబోయి పట్టుబడ్డ దళారులు


తిరుమలలో దళారులు లడ్డూ టోకెన్లను అమ్ముతున్న వైనం సాక్షాత్తు డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ కంటపడింది. ఇవాళ ఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా... లడ్డూ కౌంటర్ల వద్ద అప్పటికే ఉన్న దళారులు ఆయన వద్దకు వచ్చారు. లడ్డూ టోకెన్లు అమ్మేందుకు ప్రయత్నించారు. వెంటనే గుర్తించిన ఈవో ఐదుగురు దళారులను పట్టుకుని విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనతో తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద దళారులు సంచరిస్తున్న విషయం డిప్యూటీ ఈవో తనిఖీల ద్వారా వెల్లడైంది.

  • Loading...

More Telugu News