: డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ లో రాష్ట్రపతి విడిది
కొన్ని నెలల కిందట హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి నగరానికి వస్తున్నారు. దక్షిణాది విడిదిలో భాగంగా డిసెంబర్ 18 నుంచి 31 వరకు ఆయన ఇక్కడ విడిది చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18న రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తున్నారు. ఇదిలాఉంటే, ఈ నెల 27న మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో జరిగే అయుత చండీయాగంలో రాష్ట్రపతి పాల్గొనే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం.