: షారుఖ్ ఖాన్ ను కావాలనే టార్గెట్ చేశారు: బీజేపీ ఎంపీ హేమమాలిని


అక్టోబర్ 2వ తేదీన తన 50వ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మత అసహనం మన దేశాన్ని చీకటి యుగంలోకి తీసుకెళుతుందని, లౌకికవాదాన్ని కొనసాగించాల్సి ఉందని షారుఖ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు నిప్పులు చెరిగారు. నివసించేది భారత్ లో, మనసు మాత్రం పాకిస్థాన్ లో అంటూ విజయవర్గీయ మండిపడగా... షారుఖ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ వీహెచ్ పీ నేత సాధ్వి ప్రాచి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో షారుఖ్ కు ఊహించని విధంగా ఓ బీజేపీ ఎంపీ నుంచి మద్దతు లభించింది. అకారణంగా షారుఖ్ ను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ, అలనాటి అందాల నటి హేమమాలిని అన్నారు. షారుఖ్ పట్ల కొందరు చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పారు. తన అవార్డులను వెనక్కి ఇస్తానని షారుఖ్ చెప్పలేదు కదా? అని ఆమె అన్నారు. ఒక నటుడిగా మన దేశానికి షారుఖ్ ఎంతో చేశారని... కోట్లాది మంది ఆయనను అభిమానిస్తున్నారని తెలిపారు. షారుఖ్ ను చూసి మనం గర్వపడాలని చెప్పారు.

  • Loading...

More Telugu News