: ఆ అర్హత ఎవరికీ లేదు: సినీ నటుడు అనుపమ్ ఖేర్


దేశంలో అసహనం నెలకొందని చెప్పే అర్హత ఎవరికీ లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. భారతదేశమే ఒక సహనపూరిత దేశమని చెప్పారు. కొంతమంది పనిగట్టుకుని దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, అసహనం అనే పదాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. నకిలీ లౌకికవాదంపై తమకు నమ్మకం లేదని, తాము అసలు సిసలు లౌకికవాదులమని, దేశ భక్తులమని అనుపమ్ ఖేర్ చెప్పారు. ప్రతి దేశానికీ సమస్యలు ఉంటాయని, అలాగే మనకూ కొన్ని సమస్యలు ఉండటం సహజమని అన్నారు. దేశంలో మత అసహనం నెలకొందని ఆరోపిస్తూ కొంతమంది ప్రముఖులు, కళాకారులు, రచయితలు తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ... అనుపమ్ ఖేర్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నటీనటులు, రచయితలు, చిత్రకారులు, మేధావులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News