: అధికారులపై దాడి విషయంలో చింతమనేని స్పందన ఇది!
గత రాత్రి అటవీ శాఖ అధికారులపై తన అనుచరులు దాడి చేసినట్టు వచ్చిన వార్తలపై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారులకు లేని నిబంధనలు ప్రజలకు మాత్రం వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. కోమటిలంక ప్రజలు తమ ఊరికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతూ, సొంత డబ్బు పెట్టి రోడ్డు వేయించుకున్నారని, ఆ పనులను చూసేందుకే తాను వెళ్లానని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులను తాను తిట్టలేదని, కొట్టలేదని, వారి ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. కొల్లేరులో అటవీ అధికారులు గెస్ట్ హౌస్ లను కట్టించుకోలేదా? అని ప్రశ్నించారు. కోమటిలంక అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని తెలిపారు.