: సీబీఐ కస్టడీకి ఛోటా రాజన్... ఉత్తర్వులు జారీ చేసిన మేజిస్ట్రేట్


అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ను ఢిల్లీలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత అర్ధరాత్రి సీబీఐ అధికారులు రాజన్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో సీబీఐ వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. భద్రతా కారణాల రీత్యా న్యాయమూర్తి ఈ న్యాయప్రక్రియను రాజన్ ను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయం వద్దనే నిర్వహించారు. దీంతో, రాజన్ ను సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో విచారించనున్నారు. మరోవైపు, నిన్ననే రాజన్ ను సీబీఐ, రా, ఐబీ అధికారులు ప్రాథమిక విచారణ చేశారు. రాజన్ పై హత్య, స్మగ్లింగ్, దందాలు తదితర అంశాలకు సంబంధించి 70కి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాజన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అతనికి ఎలాంటి డయాలసిస్ అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News